AP CM Jagan : ఏపీ సీఎం జగన్ గతంలో పాదయాత్రల పేరిట నిత్యం ప్రజల్లోనే గడిపారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఇక ప్రజలను కలవడమే మానేశారు. ఆయన పర్యటనలంటే పరదాలు, బారీకేడ్ల నడుమ సాగుతున్నది. వేదికలపైకి ఎక్కి బటన్ నొక్కడం మినహా ఆయన అధికారంలోకి వచ్చి నేరుగా ప్రజలను కలిసింది లేదు. మీడియా తో మాట్లాడింది లేదు. అయితే తన కార్యమంతా ఎలాగూ రెండున్నర లక్షల మంది వలంటీర్లు చేస్తుంటే ప్రజలకు నాతో ఏం పని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ, ఆయన మాత్రం ప్రజలను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.
అయితే ఆయన సోమవారం(ఈనెల 24న) అమరావతిలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నా, ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అమరావతి రైతుల ఆందోళనల మధ్య ఆయన పర్యటన కొనసాగుతున్నది. దీంతో ఆయన పర్యటన మొత్తాన్ని హెలీక్యాప్టర్ లోనే ఖరారు చేశారు. తాడేపల్లి నుంచి బయలుదేరి, వెంకటాయపాలెం, కృష్ణయాపాలెం అనే గ్రామాల్లో పర్యటించాలి. తాడేపల్లి నుంచి వెంకటాయ పాలెం ఆరు కిలోమీటర్లు, అక్కడి నుంచి కృష్ణయాపాలెం మరో రెండు కిలోమీటర్లు. ఈ మొత్తం పర్యటనను ఆయన హెలీక్యాప్టర్ లోనే కొనసాగించనున్నారు. ఇందుకోసం రెండు గ్రామాల్లో హెలీప్యాడ్ అను అధికారులు సిద్ధం చేశారు. ప్రజల ఆందోళన ల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఇలా హెలీక్యాప్టర్ లో వచ్చి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేశారని సమాచారం. మరో వైపు ఈ రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తు న పోలీస్ బలగాలను రంగంలోకి దింపారని సమాచారం. ఇంకేం ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా జగన్ తాను చేయాలనుకున్నది చేసి వెళ్తారన్న మాట. ప్రజల మద్ధతు ఉందని చెప్పుకునే జగన్ ఇంత భయంగా పర్యటనలు చేయడం ఏంటని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
|
ReplyForward
|






