
Jagan Vs Lokesh : టీడీపీ యువనేత లోకేశ్ పాదయాత్ర కడప జిల్లాకు చేరుకుంది. ఈ జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎక్కువగా పట్టు ఉంటుంది. అంటే ఏపీ సీఎం జగన్ ఇలాఖాలోకి టీడీపీ యువనేత అడుగు పెట్టారన్నమాట. కడప ముందు నుంచి వైసీపీ కి కంచుకోట. ఇప్పటికే గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ జిల్లాలో ఖాతా తెరవకుండా చేసింది.
అయితే లోకేశ్ యువగళం పాదయాత్ర తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చేరుకుంది. అయితే అంతకుముందు యువగళం యాత్ర 40 రోజుల పాటు కర్నూల్ జిల్లాలో కొనసాగింది. అయితే జమ్మల మడుగులో ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. లోకేశ్ తన పాదయాత్రలో జగన్ పై విమర్శలు, గతంలో తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటుూ వెళ్తున్నారు. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతి చర్చ మొదలుపెట్టి వెళ్తున్నారు. అయితే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టీడీపీ కి చెప్పుకోవడానికి బలమైన నాయకులు లేరు. గతంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి, రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం భూపేశ్ రెడ్డి పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.
అయితే జగన్ కడప జిల్లా పర్యటను కూడా ఎక్కువ రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు కాగా, అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే జగన్ ప్రధాన అడ్డా పులివెందులకు మాత్రం లోకేశ్ వెళ్లడం లేదని సమాచారం. రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తున్న యువనేత పులివెందులకు రాకపోవడంపై వైసీసీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో వైసీపీ, సీఎం జగన్ పై విమర్శనాస్ర్తలు ఎక్కుపెడుతూ ముందుకెళ్తున్న లోకేశ్, జగన్ సొంత ఇలాఖాలో ఎలాంటి చర్చను లేవనెత్తుతారోనని రాజకీయ విశ్లేషకులు, స్థానిక టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.