Jagananna Colony : జగనన్న కాలనీల పేరిట ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు అనువైన ప్రదేశాల్లో నిర్మించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వానలకు మునిగిన జగనన్న కాలనీల్లో ఈతలు కొట్టి టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ప్రతీచోట చెరువులు, కుంటలు, ముంపు ప్రాంతాల్లో నిర్మిస్తున్నారని విమర్శించారు. ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ అవి అనువుగా లేకున్నా వాటిలో ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చారని.. వానలకు , ప్రకృతి ఉపద్రవాలకు అవి నిలవలేకపోతున్నాయని రుజువైంది.
తాజాగా గుడివాడ నియోజకవర్గంలోని మల్లయ్యపాలెంలోనూ అదే చోటు చేసుకుంది. వెనిస్ నగరాన్ని గుడివాడకు తీసుకొచ్చిన వైఎస్ జగన్ అంటూ స్థానికులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి నెలకొంది.
గుడివాడ జగనన్న కాలనీ కొద్దిపాటి వర్షానికే నీట మునిగింది. నీటి సమస్య లేకుండా చెరువునే ఇళ్ళమధ్యకు తీసుకొచ్చిన మోడరన్ ఇంజనీర్ జగన్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. రోడ్లపై వెళ్లే అవసరం లేకుండా త్వరలో పడవలు కూడా తెప్పిస్తారు, పెట్రోల్ ఖర్చులు తగ్గిస్తాడు అంటూ నీట మునిగిన జగనన్న కాలనీల వీడియోలపై ట్రోల్స్ చేస్తున్నారు.
మౌలిక వసతుల ఖర్చు 100% తగ్గించిన విజనరీ జగన్ అంటూ మునిగిన జగనన్న కాలనీల వీడియోలను వైరల్ చేస్తున్నారు. స్మశాన వాటిక కు కూడా ఇలాంటి స్థలం ఇవ్వరని.. ఇలాంటి ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల జీవితాలను నాశనం చేస్తున్నందుకు మాకొద్దు జగన్ – రావొద్దు జగన్ అంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.