Jagananna Scheme Satire : ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని గత కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు మొత్తుకుంటూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ కు బటన్ నొక్కుడు మీద ఉన్న శ్రద్ధ ఏపీ అభివృద్ధి మీద లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తూనే ఉంటారు. తాజాగా ఏపీలో ఒక రోడ్డుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆ వీడియోను పెట్టి జగనన్న గొయ్యి పథకం అంటూ పలువరు ట్రోల్ చేస్తున్నారు.
ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి కృష్ణదేవునిపేటకు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా స్థానికులు ఈ గుంతల వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘జగనన్న గొయ్యి’ పథకం అమలులో ఉంది.. జర చూసుకొని వెళ్లండి అంటూ వ్యంగ్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ద్వారా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్షాల మీద కక్ష సాధింపులకు ఉన్న సమయం, విదేశాలకు టూర్ల మీద ఉన్న ప్రజల బాగోగులు చూసేందుకు సీఎం జగన్ కు ఉంటే బాగుండని విమర్శలు చేస్తున్నారు. వరెస్ట్ సీఎం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక దీనిపై వైసీపీ శ్రేణుల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరిట తీసుకుంటున్నారుగా.. ఇంకా రోడ్లు ఎందుకు అడుగుతున్నారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఇప్పుడు జగనన్న గొయ్యి పథకం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్లతో ఆటాడుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. రోడ్లు బాగు చేయలేని వాడు.. ఇంకా రాజధాని ఏం నిర్మిస్తాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక్క చాన్స్ అంటూ రాష్ర్టాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాడని మండిపడుతున్నారు.