
Chandranna Schemes : ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కీలక మార్పులు చేర్పులు చేస్తోందని స్పష్టమవుతోంది. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన అనేక కార్యక్రమాల పేర్లను మారుస్తూ జగన్, వైఎస్ఆర్ ల పేర్లను తీసేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పథకాల పేరు మార్చండి:
జగనన్న విద్యా దీవెన – పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్
వైఎస్ఆర్ కళ్యాణమస్తు – చంద్రన్న పెళ్లి కానుక
జగనన్న విదేశీ విద్యా నిధి – అంబేద్కర్ విదేశీ విద్యా నిధి
YSR శిక్షణ – NTR శిక్షణ
జగనన్న విద్యా కానుక – స్టూడెంట్ కిట్ గా మారుస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.