27.7 C
India
Saturday, May 17, 2025
More

    Vijayamma : విజయమ్మతో జగన్ కు చెక్.. వైఎస్ షర్మిల మాస్టర్ ప్లాన్ అదుర్స్

    Date:

    Vijayamma
    Vijayamma

    Vijayamma : ఏపీలో పొలిటికల్ గేమ్ కొత్త మలుపు తిరిగిందా? వైసీపీ అధ్యక్షుడు జగన్ కు చెక్ పెట్టేందుకు విజయమ్మతో వైఎస్ షర్మిల వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా.. అసలు ఏపీపీసీసీ చీఫ్ స్కెచ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనికి పరోక్షంగా వైఎస్ షర్మిల కూడా కారణమన్నారు. అంతే కాదు బీజేపీని ఢీకొట్టి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది.

    ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ఏపీలో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పరాజయం పాలైన త‌ర్వాత ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాల‌ని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు తన సత్తా చాటేందుకు వైఎస్ షర్మిల మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇందుకోసం దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ కుటుంబంలో కీలకంగా ఉన్న  వైఎస్ షర్మిల తన తండ్రి 75వ జన్మదిన వేడుకలను అవకాశంగా మలచుకోవాలని భావిస్తున్నారట.  వైఎస్ఆర్ అభిమానులను, వైసీపీ నేతలను మళ్లీ కాంగ్రెస్ గూటికి చేర్చడమే ప్రధాన ఎజెండాగా ఆ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అందుకే విజయవాడలో జరిగే వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు.

    అంతే కాదు ఇదే వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి పాల్గొనాల్సిందిగా తల్లి విజయమ్మకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల ప్లాన్ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ కు దీటుగా మైలేజ్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో వైసీపీ పార్టీకి మద్దతిచ్చే వారు లేరు. ప్రభుత్వంలో ఉండగా జరిగిన అక్రమాలు, గతంలో ఉన్న కేసులు తిరగదోడితే జగన్ ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Sharmila : వదిన కోసం రంగం లోకి దిగిన షర్మిల

    Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా...

    Assembly boycott : జగన్ అసెంబ్లీ బహిష్కరణ బాధ చంద్రబాబుకా..? షర్మిలకా..?

    assembly boycott : ఈ రోజు (సోమవారం - నవంబర్ 11)...

    Sharmila comments : వైసీపీ నాయకులు దశాబ్ధపు పెద్ద జోక్ పేల్చారు..! షర్మిల కామెంట్స్..

    Sharmila comments : జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతుందని వైసీపీ...