Jai, Dr Jagadeesh Babu Yalamanchili : తెలుగు వారి పండుగ అయిన ‘తానా మహాసభలు’ ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులతో ఈ సమావేశాలు కోలాహలంగా మారాయి. ఎంతోమంది ప్రముఖులు హాజరవుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం తానా మహాసభలకు హాజరయ్యారు.
తానా మహాసభలకు అమెరికాకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో యూబ్లడ్ ఫౌండర్ జై, డా. జగదీష్ బాబు యలమంచిలి గారు కలుసుకున్నారు. వివిధ అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా జై గారి సేవా కార్యక్రమాలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ జై గారు యూబ్లడ్ తో ఎంతో మందికి ప్రాణదాతగా మారుతున్నారు. ఆయన సేవలను రేవంత్ రెడ్డి అభినందించారు. రేవంత్ రెడ్డిలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జై గారు అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డితోపాటు ఈ సమావేశంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , టీడీపీ నేతలు, పలువురు ప్రముఖ ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.