BONDA UMA : అమెరికాలో టీడీపీ నేతలు సందడి చేస్తున్నారు. ప్రవాస తెలుగువారితో కలిసి పోతున్నారు. తానా మహాసభల కోసం వచ్చిన టీడీపీ నేతలు అక్కడి తెలుగు వారి కార్యక్రమాలు, పలువురి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
తాజాగా విజయవాడ సెంట్ర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన బొండా ఉమాతోపాటు పలువురు నేతలు అమెరికాలోని న్యూజెర్సీ గల విద్య గారపాటి ఇంటిని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో యూబ్లడ్ యాప్ అధినేత జై డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు కూడా పాల్గొని బోండా ఉమా ఇతర టీడీపీ నేతలతో కలిసి పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా బోండా ఉమాతోపాటు మిగతా నేతలను శాలువాలు, బోకెలతో డాక్టర్ జగదీష్ గారితోపాటు మిగతా ఎన్నారై మిత్రులు సన్మానించారు.