
Jai NTR : శతకోటి జన హృదయ విజేత
శత్రువు సైతం చేతులెత్తి మొక్కు జగజ్జేత
నిత్య నీరాజనాలు అందుకుంటున్న జననేత
తెలుగు జాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత
జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాల చిరునామా
విలక్షణ పాత్రలకు సలక్షణ రూపమిచ్చిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
పట్టుదల, క్రమశిక్షణ, కార్యదీక్షా దక్షుడా.. శతవసంతాల శకపురుషుడా..
మా నందమూరి తారక రాముడా.. అందుకో.. శతకోటి నమసుమాంజలులు..
ప్రజా చైతన్యానికి ఆయుధమై..
పేద ప్రజల పాలిట పట్టెడన్నమై..
పరబ్రహ్మస్వరూప అన్నదాతకు వరబ్రహ్మై..
పటేల్, పట్వారీ నిర్మూలించి నవశకానికి నాందియై..
ప్రాంతీయ పార్టీల దిక్సూచియై..
రేపటి ఆశల రూపమై..
బడుగు, బలహీన వర్గాలను అందలమెక్కించిన ఆద్యుడై..
కూడు, గుడ్డ, నీడనందించిన నాయకుడై..
ఆడపడుచులకు సమహక్కులిచ్చిన అన్నై..
అన్నదమ్ములకు ఆత్మబంధువై..
తెలుగు జాతి ఔన్నత్యానికి నిలువెత్తు రూపమై నిలిచిన
తెలుగు జగతి చక్రవర్తి.. తరాలు మారిన తరగని ప్రేమ
శతాబ్దాలు గడిచినా చెదరని రూపం.. యుగాలు దాటినా మరువని వైనం
జగాలు కదలినా వదలని పాశం.. మరువలేని.. మరలరాని.. మహోన్నతం
మా నందమూరి తారక రామన్న చరితం..
జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్