
Jai Sriram Full Song : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఎట్టకేలకు వచ్చే నెల రిలీజ్ కు రెడీ అయ్యింది. ముందు నుండి కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన ట్రైలర్ తో అంచనాలు పెంచేసుకుని మొన్నటి వరకు ఉన్న నెగిటివ్ టాక్ పోగొట్టుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు మరి కొద్దీ సమయమే ఉండడంతో ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా అప్డేట్ లను ఇస్తూ అంచనాలు మరిన్ని పెంచడానికి చుస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ”జై శ్రీరామ్” అనే పాటను రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ ఇప్పటికే ఒక చిన్న బిట్ ను వదిలారు.. జై శ్రీరామ్ అనే మంత్ర నామం విని అంతా వేరే లోకంలోకి వెళ్లిపోయారు.
ఇక ఇప్పుడు ఈ సాంగ్ మొత్తం రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ మొత్తం వేరే లెవల్లో వింటుంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.. ముంబైలో ఏర్పాటు చేసిన లైవ్ లో అజయ్ – అతుల్ తమ సంగీత వాయిద్యాలతో పాడుగా ఆద్యంతం అలరించేలా ఉంది.. నిజంగా ఈ సాంగ్ ను కళ్ళ ముందు చూసినట్టు ఉంది.. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి..