‘Jailor’ First Day Collections : సూపర్ స్టార్ రజినీకాంత్ కు వరల్డ్ వైడ్ గా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఈయన స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.. కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగులో కూడా రజినీకాంత్ ను ఆదరించే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు..
మరి అలాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా చాలా రోజుల తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.. ప్రజెంట్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”జైలర్”.. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా.. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..
నిన్న రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ తో దూసుకు పోతుంది అనే చెప్పాలి.. రజినీకాంత్ వింటేజ్ లుక్, ఆయన స్టైల్, యాక్షన్ అన్ని కూడా ఈ సినిమాను హై లో నిలబెట్టాయి.. ఇక ఇదిలా ఉండగా రజినీకాంత్ జైలర్ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఓపెనింగ్స్ ను కుమ్మేసింది అని టాక్..
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 95.78 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు టాక్.. కోలీవుడ్ లో 29.46 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 12.04 కోట్లు, కర్ణాటకలో 11.92 కోట్లు ఓవర్సీస్ లో ఏకంగా 32.75 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.. ఇక వీకెండ్ లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. చూడాలి వరుస సెలవులను రజినీకాంత్ ఎలా ప్లస్ గా మార్చుకుంటాడో..