ఒకవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజ్ అయినా కూడా సూపర్ స్టార్ కలెక్షన్స్ హవా ఏ మాత్రం తగ్గలేదు.. భోళాకు నెగిటివ్ టాక్ రావడంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ హవా కొనసాగుతుంది. రజినీకాంత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”జైలర్”..
ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా.. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకు పోతుంది.. మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ రెండో రోజు కూడా ఊపు ఏ మాత్రం తగ్గలేదు.
మొత్తంగా 122.50 కోట్ల బిజినెస్ చేసుకున్న ఈ సినిమా 123 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 95.78 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయగా రెండవ రోజు కూడా భారీగా రాబట్టింది.. జైలర్ రెండో రోజు 50 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది.. ఇక వీకెండ్ లో కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం ఖాయం అని తెలుస్తుంది.