Jailor’ Censor Review :
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని సినీ లవర్స్ లేరు అనే చెప్పాలి.. ఈయన కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. ముఖ్యంగా తెలుగులో ఈయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఇది వరకు ఈయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు..
అయితే గత కొన్నేళ్లుగా ఈయనకు సరైన హిట్ పడకపోవడంతో పోటీలో వెనుక బడ్డాడు. కానీ తాజాగా ఈయన నటిస్తున్న సినిమా రెస్పాన్స్ చూస్తుంటే ఈసారి సూపర్ స్టార్ సరైన హిట్ అందుకోవడం ఖాయం.. మళ్ళీ రజినీకాంత్ కు బాక్సాఫీస్ దగ్గర పూర్వవైభవం వస్తుంది అని అంటున్నారు. మరి ప్రజెంట్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”జైలర్”..
ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో గత కొన్నేళ్లలో లేని అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా జైలర్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. 2 గంటల 49 నిముషాల నిడివి ఉన్న ఈ సినిమాలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని కూడా సమపాళ్లలో ఉన్నాయని ఈసారి రజినీకాంత్ లుక్ అండ్ ఎలివేషన్స్ తో పాటు ఆయన వింటేజ్ లుక్ కూడా ఫ్యాన్స్ కు కొత్త అనుభూతి ఇస్తాయని ఈసారి బొమ్మ అదుర్స్ అని అంటున్నారు.
దీంతో సెన్సార్ రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం అంటున్నారు. అయితే ఈ సినిమాకు పోటీగా మన మెగాస్టార్ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ కాబోతుండడంతో మన తెలుగులో జైలర్ కు కలెక్షన్స్ కష్టమే అని చెప్పాలి.