TDP On Volunteers :
వలంటీర్ వ్యవస్థను పూర్తిగా తొలగిస్తామన్న సంకేతాలను జనసేన, టీడీపీ పార్టీలు ఇస్తున్నాయి. మొన్న ‘వలంటీర్లు బ్రోకర్లు’ అంటూ పవన్ కళ్యాణ్ నిందించగా, నేడు చంద్రబాబు కూడా ఆయనకు గొంతు కలిపినట్లుగా కనిపిస్తుంది. తన పచ్చ మీడియాలో ఈ రోజు (జూలై 13)న ఒక కథనం ప్రచురించారు. ఇందులో భార్య భర్తల గొడవలు వలంటీర్లకే కావాలా? అన్న కోణంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం ఇది కూడా రచ్చవుతోంది. జనసేన, టీడీపీలు పొత్తు పవనాలు వీస్తున్న వేల పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడడం వీరి పొత్తు ఖాయమని అనుకుంటున్నారు.
గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడిన వారే. చంద్రబాబు వలంటీర్ల కష్టాన్ని దగ్గరి నుంచి చూశానని వారు చాలా కష్టాల్లో ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే వారిని కడుపులో పెట్టి చేసుకుంటామని కూడా చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇదే అర్థం వచ్చేలా మాట్లాడి ఇప్పుడు అభిప్రాయం, స్వరం రెండూ మార్చారు.
అయితే, వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తున్న ముసుగులో వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే ఇప్పటి వరకు వందలాది టీడీపీ, జనసేన గడపలకు కూడా పథకాల ఫలాలను తీసుకెళ్లామని మరి అక్కడ కూడా ప్రచారం చేస్తున్నామా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రచారం చేసేందుకు వలంటీర్ వ్యవస్థ లేదని, కేవలం ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామని, అది జగన్ ప్రభుత్వమే కాదు టీడీపీ ప్రభుత్వం ఉన్నా అలానే చేస్తామని వలంటీర్లు చెప్తున్నారు. తమపై బురదచల్లడం మానుకోవాలని కోరుతున్నారు.
https://twitter.com/PoliticalPunch9/status/1679367618581626880?s=20