
Janasenani contest : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తన పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నారు. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయనే చొరవ తీసుకొని రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్తన్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించడమే రాష్ర్ట ప్రయోజనాలకు మంచిదని ఆయన భావిస్తున్నారు.
అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ 2019లో రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా ఆయన ఈ రెండింటిలో ఒకదాని నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ కూడా ఈ స్థానాన్ని పవన్ కు కేటాయించేందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే భీమవరం స్థానం నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ పవన్ ను పోటీ చేయిస్తే గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఈసారి ఖాయమని భావస్తున్నారు.
ఇఫ్పటికే ఆ దిశగా సర్వే రిపోర్టు కూడా అందినట్లు సమాచారం. అయితే తనకు శాశ్వతంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని సిద్ధం చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు జన సేన శ్రేణులు చెబుతున్నాయి. మరి పవన్ మదిలో ఏముందో తెలియాల్సి ఉంది, గోదావరి జిల్లాల్లో ఆయన కు అభిమానులెక్కువ. అక్కడి నుంచే తను పోటీ చేస్తే వైసీపీని ఈ జిల్లాల్లో అడ్డుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇక భీమవరంలో పవన్ పోటీ ఖాయమైతే, ఈ సారి గెలవడం పక్కా అనే టాక్ వినిపిస్తున్నది.