21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Jaswanthi Reddy : అఖిల ప్రియపై జశ్వంతి రెడ్డి ఫైర్.. ఆమెను ఓడించి తీరుతామనని ప్రతిజ్ఞ

    Date:

    Jaswanthi Reddy
    Jaswanthi Reddy

    Jaswanthi Reddy : లోకేశ్  పాదయాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు కనిపించాయి. పార్టీలో రెండు వర్గాలుగా చీలిన నేతలు పరస్పరం దాడులకు కూడా దిగారు. రోడ్డుపై కొట్టుకున్నారు. ఇందులో ఇరువైపులా టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నంద్యాలలో అడుగు పెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు భూమా అకిలప్రియ, ఏవీ సుబ్బారారెడ్డి వారి వారి అనుచరులతో పెద్ద ఎత్తున కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేశ్ ముందు బల ప్రదర్శనకు దిగారు. వారి వారి బలాన్ని ప్రదర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య మొదట మాటలయుద్ధం జరిగింది. అక్కడే వారు సవాల్ విసురుకున్నారు. అంతటితో ఆగకుండా అఖిలప్రియ వర్గీయులు ఏవీ వర్గీయులపై దాడులకు దిగారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ దాడిపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. అఖిల ప్రియపై విరుచుకుపడ్డారు. తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ లో లైవ్ ఇచ్చారు. ఒక వీడియోను ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తన తండ్రిగానీ, తాను గానీ పోటీ చేసి తీరుతామని అన్నారు. అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు  టికెట్ ఇస్తే అక్కడ ఆమెను ఒడించేందుకే పని చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అఖిల ను ఓడించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తామని జశ్వంతి రెడ్డి చెప్పారు.

    తనను కూతిరిలా చూసుకున్న ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ దుయ్యబట్టారు. ఆమెది లోక్లాస్ మైండని ఆమెను ప్రజలు ఎమ్మెల్యేగా అంగీకరించరని జోస్యం చెప్పారు. ఆమెకు టికెట్ ఇచ్చే విషయం పార్టీ అగ్రనాయకత్వం పరిశీలించాలని ఏవీ కూతురు టీడీపీ అధిష్టానాన్ని జశ్వంతి రెడ్డి కోరారు. అఖిల లాంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    TDP Coalition: కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!

    TDP Coalition: టీడీపీ స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావస్తుంది. ఇప్పటికే...