Jayalalitha : తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన సినిమాలనే చూస్తూ పెరిగింది. తల్లి ప్రోత్బలంతో ఆయన పక్కన నటించే అవకాశం అందుకుంది. ఆయననే చూస్తూ పెరుగుతూ ఆయన సరసన హీరోయిన్ గా కూడా చేసింది. ఆ తర్వాత ఆయనపై ప్రేమను పెంచుకుంది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది.
ఏజ్ గ్యాప్ ను పట్టించుకోలేదు. కేవలం ఆయన తనను చూసుకునే విధానం చాలని అనుకుంది. ఆయనకు భార్య పిల్లలు ఉన్నా కూడా రెండో భార్యగా వెళ్లేందుకు సిద్ధపడింది. కానీ సదరు హీరో సమాజం, సంఘానికి బయపడి పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె జీవితాంతం కన్యగానే ఉండిపోయింది. వారే తమిళ సూపర్ స్టార్లు, మాజీ ముఖ్యమంత్రలు ఏంజీఆర్, జయలలిత.
1965లో ‘వెన్నిర ఆడై’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన జయలలిత రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. తమిళనాడుకు 6 సార్లు సీఎంగా పని చేశారు. 1961, 1980 మధ్య 140 చిత్రాల్లో నటించారు. సినిమా, రాజకీయ జీవితంతో పాటు ప్రేమ వ్యవహారాల్లో కూడా వార్తల్లోకి ఎక్కారు. ఎంజీఆర్ చాప్టర్ తర్వాత సౌత్ స్టార్ అందాల నటుడు శోభన్ బాబును కూడా జయలలిత ఇష్ట పడిందని వార్తలు వచ్చాయి.
ఇక్కడ కూడా శోభన్ బాబుకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయినా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. ఎంజీఆర్ మాదిరిగానే శోభన్ బాబును కూడా వివాహం చేసుకోవాలని అనుకుందట జయలలిత. కానీ ఆయన ఫ్యామిలీ దృష్ట్యా దూరం పెట్టారట. దీంతో ఆయనకు కూడా దూరమైంది.
‘డాక్టర్ బాబు’ శోభన్ బాబుతో కలిసి జయలలిత నటించిన మొదటి సినిమా. ఇది శోభన్ బాబు నటనా జీవితంలో చివరి చిత్రంగా కూడా నిలిచింది. వాస్తవానికి ఎంజీఆర్ కోరిక మేరకు ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించింది జయలలిత. ఎంజీఆర్ కు సపోర్ట్ గా ప్రచారం చేసింది. ఆయన సీఎం అయ్యాక కీలక పదవులు చేపట్టింది.
ఎంజీఆర్-జయలలిత మధ్య ఉన్న క్లోజ్ నెస్ కు పార్టీలోని కొందరు అసూయపడ్డారు. అన్ని డిషిజన్స్ ఆమెను అడిగే తీసుకుంటున్నారంటూ ఆరోపణలు చేసి ఆమెను బయటకు పంపించివేశారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
తమిళ వార్తా పత్రిక మనోరమ కథనం ప్రకారం.. ఎంజీఆర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సందర్భంలో జయలలిత ప్రధానికి లేఖ రాశారని, అందుకే ఆమెను కలిసేందుకు ఎంజీఆర్ అనుమతించారని పేర్కొంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు జయలలితను హాస్పిటల్ లోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
1987, డిసెంబరు 24న ఎంజీఆర్ కన్నుమూశారు. ఆ తర్వాత జయలలిత చివరి యాత్రకు హాజరయ్యారు. తన రాజకీయ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని పేదల కోసం ఎన్నో సేవలు చేసినా ‘తాంసీ ల్యాండ్ డీల్ కేసు’, ‘1996 కలర్స్ టీవీ సెట్స్’ వంటి వివాదాలు ఆయనను అదుపులో పెట్టాయి. 2016, డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఫిబ్రవరి 24న ఎంజీఆర్ జయంతి. ఆమె జీవించి ఉంటే 76 ఏళ్లు ఉండేవి.