Jayalalithaa : చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రులు గడిపిన అవమానాలు, జైలు జీవితం గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు అతి సమీపంలోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను చెప్పింది. ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీ నుంచి బయటకు వచ్చిన సినీ నటుడు, నాయకుడు ఎంజీ రామచంద్రన్ ‘ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం(AIADMK)’ ఏర్పాటు చేశారు. ఆయన నాయకత్వంలోనే జయలలిత పని చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలగడంతో పార్టీలోని పెద్దలకు అసూయ కలిగింది. ఈ నేపథ్యంలో ఆమెను అసెంబ్లీలోకి రానీయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా ఆమె అవన్నీ తట్టుకొని అసెంబ్లీలోకి వచ్చింది.
‘ద్రవిడ మున్నెట్ర కజగం (DMK) ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో అంసెబ్లీలో సభ జరుగుతుండగా 25 మార్చి, 1989న ఆమెను అటాక్ చేశారు. ఆమె కట్టుకున్న చీరను చింపి, జుట్టును చరిపేసి నానా యాగి చేశారు. ఆ సమయంలో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాను. ఆ తర్వాత ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టాను.’ అంతలా కష్టపడ్డానని చెప్పింది.
ఆమె జైలు జీవితంపై ఇంటర్వ్యూవర్ ప్రశ్నించినప్పుడు
‘అక్రమ ఆస్తులు కూడబెట్టిందన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 27 సెప్టెంబర్, 2014న బెంగళూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించింది. పదవి కూడా పోయింది. 2014 నుంచి 2015 (విడుదలన) వరకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
తమిళనాడులోని మద్రాస్ సెంట్రల్ జైలులో నన్ను ఉంచారు. ఇది నా జీవితంలో బ్యాడ్ డేస్ అనే చెప్పాలి. కేంద్ర కారాగారంలో అన్నీ సమస్యలే.. 1837లో స్థాపించిన జైలు జైలులో ఎక్కడా చూసినా ఫంగస్, చెత్తతో ఉంది. పంది కొక్కులు, ఎలుకలు పక్కనే తిరుగుతుంటాయి. ఇక జైలు బయట విపరీతమైన చెత్త, చెదారం ఉండడంతో దోమలకు కొదువ లేదు అన్నట్లుగా ఉంటుంది. అన్నీ సమస్యలే. నిత్యం సవాళ్లు, సమస్యలతోనే కాలం వెళ్లదీయాల్సి వచ్చేది. దాదాపు సంవత్సరం పాటు జైలులోనే గడిపాను. షార్ట్ టెంపర్, కోపిస్టి అయిన నేను ఏడాది పాటు ఎలా సహనం వహించానో ఆశ్చర్యం వేస్తుందని ఆమె అన్నారు.