Jayaprakash Narayana :
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో ఆయన దేశంలోని అంశాలపై విస్తృతంగా మాట్లాడగలరు. రాష్ట్రాలు, దేశాల్లో ఎలాంటి విషయాలు జరిగినా ఆయన స్పందించే తీరు అందరినీ ఆకర్షిస్తుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన ఏమన్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలు తెస్తుంది. వీటిలో లోపాలు ఉంటే సభలో చర్చించవచ్చు కానీ ఏదో ఆక్రోషం వెళ్లగక్కుతూ అరెస్ట్ ల వరకు పోవడం సరైన చర్య కాదు. ఇక స్కిల్ డెవలప్ ప్రాజెక్ట్ లో స్కాం జరిగింది అనుకుందాం.
దానికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం అన్నీ జరిగిపోయాయి. ఒక వేళ అందులో స్కాం జరిగితే ఎక్కడ తప్పు జరిగిందో చూడాలే గానీ అన్నింటికీ కారణం చంద్రబాబు అని నిందిస్తూ అరెస్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదన్నారు. జయప్రకాశ్ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో ఏపీలో చంద్రబాబుకు మరింత మద్దతు పెరిగిందని చెప్పవచ్చు. బాబును ఎలాంటి తప్పు చేయలేదని ఈ ప్రాజెక్టులో ఉన్న మేజర్ కంపెనీలు సైతం చెప్తున్నా ఆయనకు ఇప్పటికీ బెయిల్ దొరకలేదంటే ఆలోచించాల్సిన విషయమేనని అన్నారు. ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏం తేలుస్తారో వేచి చూడాలి మరి.