
తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జయదేవ్ గల్లా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం గళం విప్పిన చిత్రాలు, అమరావతి రాజధాని కోసం రైతుల పోరాటంలో ఎదుర్కొన్న విచారక సంఘటనలను గుంటూరు పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను భారీ సైకత శిల్పం రూపంలో పొందుపరిచారు. ఈ భారీ సైకత శిల్పాన్ని అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చే ప్రత్యేకంగా రూపొందించి ప్రదర్శనలో ఉంచడం విశేషం.

గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లాతో పాటు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్,
టీడీపీ అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టీడీపీ గుంటూరు పశ్చిమ ఇన్ చార్జి కోవెలమూడి రవీంద్రతో పాటు టీడీపీ నేతలు, అమరావతి రైతులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఎంపీగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అద్వితీయమైన సేవలు అందజేశారన్నారు. తనలాంటి శ్రమజీవులను గుర్తించి పార్టీ అధినాయకత్వం సహకారంతో ఎంతో మందికి వివిధ అవకాశాలు కల్పించారన్నారు. జయదేవ్ లాంటి నిస్వార్థ సేవకుడి రాజకీయ నిష్క్రమణ బాధాకరమన్నారు. ఆగర్భ శ్రీమంతుడైన జయదేవ్ కు ఏమిచ్చి రుణం తీర్చుకోలేమన్నారు. చిరకాలం ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకుంటారన్నారు.
