Jio Revolution : సమాచార రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జియో సాంకేతికతతో ముందుకు వెళ్తోంది. జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. జియో తీసుకొస్తున్న మార్పులతో వినియోగదారులకు ప్రయోజనాలు దక్కుతున్నాయి.
జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గరలోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. దీంతో నెట్ వేగవంతంగా అందుబాటులోకి వస్తుంది. రూ.599 నుంచే దీని ధర ప్రారంభం అవుతుంది. అన్ లిమిటెడ్ డేటా మన సొంతం అవుతుంది. గతంలో కూడా జియో తీసుకొచ్చిన అధునాతన ఆఫర్లతో దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే.
ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. దీంతో జియో తీసుకొచ్చిన ఆఫర్ కు అందరు మొగ్గు చూపే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అన్ లిమిటెడ్ డేటా ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు. ఈమేరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటన చేయడంతో వినియోగదారుల్లో ఉత్సాహం నెలకొంది. రూ.599 తో అన్ని రకాల సేవలు పొందవచ్చని తెలుస్తోంది.
సమాచార రంగంలో పలు మార్పులు తీసుకురావడం రిలయన్స్ కు కొత్తేమీ కాదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా దానికి తొందరగా వినియోగదారులను ఆకర్షించడంలో ముందుంటారు. ఇందులో భాగంగానే ఎయిర్ ఫైబర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి మరో విప్లవం తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేసింది.