
KTR inaugurated : హైదరాబాద్ నగరం మరోసారి వార్తల్లో నిలుస్తుంది. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు పెద్ద ఫ్యాక్టరీని కట్టాలని చూస్తుంది. అందుకు భూమిపూజ కూడా సోమవారం చేసింది. ఈ కంపెనీ ఆదిభట్ల పరిధిలోని కొంగరకలాన్ లో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 196 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ఈ పూజల్లో తెలంగాణ పంచయతీరాజ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంస్థ ప్రపంచంలోని ప్రఖ్యాత సెల్ ఫోన్ల మోడళ్లలో కొన్ని భాగాలను తయారు చేయనుంది. ఈ సంస్థ ప్రత్యక్షంగా 25 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది.
భూమి పూజ అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని అన్నారు. కంపెనీతో ఒప్పందం చేసుకున్న రెండు నెలల్లోనే భూమిపూజ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కంపెనీ ఉద్యోగాలతో కలిసి ఇప్పటి వరకూ 23 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పుకచ్చారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఫాక్స్ కాన్ తెలంగాణలో పట్టు బడులు పెట్టడం ఇక్కడి యువత అదృష్టంగా భావించాలన్నారు. అయితే వచ్చే ఏడాది కంపెనీ ఉత్పత్తులు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయని అందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు అందుతాయని హామీ ఇచ్చారు. ఈ సభ ద్వారా మంత్రి ఫాక్స్ కాన్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు కేటీఆర్. గడిచిన తొమ్మిదేళ్లలో ఇండస్ట్రీల ఏర్పాటు, వాటికి కల్పించే మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే తెలంగాణ టాప్ లోకి వెళ్లిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ఐటీలో దేశంలో రెండో స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధి కల్పన అనేది ప్రతీ రాష్ట్రానికి పెద్ద సవాల్ అన్నారు మంత్రి. జనాభా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, అది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తే అందులో కూడా ఉపాధి అవకాశాలు కలిగితే ఇక్కడి యువతకు అవి కూడా మేలు చేస్తాయన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ నగరం గురించి గతంలో మాట్లాడారని మంత్రి చెప్పారు. ఈ భూమి పూజలో తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు.
