MP Vemireddy : నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యు డు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్ధం పు చ్చుకున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనా మా ప్రక టిం చిన ఆయన.. ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఇతర నాయకులు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. తనకు కార్యకర్తలు మరోసారి మద్ద తుగా నిలవాలని కోరారు. చంద్రబాబు మాట్లాడు తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవకు మారుపే రని, అజాత శత్రువని తెలిపారు. మరోవైపు విశాఖలో దోచేసిన వ్యక్తికి నెల్లూరు ఎంపీ సీటు ఇస్తున్నారని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు మొదలవుతుందన్నారు.
వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. అయితే ఆయన పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లలో మాత్రం అభ్యర్ధుల్ని కనీస సమాచారం లేకుండా మార్చేశారు. దీంతో హర్ట్ అయిన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆర్ధికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి ఈసారి టీడీపీవైపు మళ్లడంతో నెల్లూ రులో రాజకీయం ఆసక్తికరంగా మారింది.