30.1 C
India
Sunday, April 19, 2026
More

    జూ. ఎన్టీఆర్ ది మామూలు టాలెంట్ కాదు..

    Date:

    NTR Talent
    NTR 

    NTR Talent: ఆనాడు  ఎన్టీఆర్ వెండి తెరమీద ఎంత సక్సెస్ అయ్యాడో..  నేడు జూ. ఎన్టీఆర్ కూడా అంత సక్సెస్ అయ్యాడు. జూ. ఎన్టీఆర్ అంత పర్సనాల్టీ ఉన్న సినిమారంగంలో తనదైన శైలిలో నటించి ప్రేకుల్లో ఎంతో అభిమానాన్ని చూరగొన్నాడు. జూ. ఎన్టీఆర్ ఎంతో ప్రతిభ, మంచి మాటకారి, 2009లో చంద్రబాబుకు మద్దతుగా తాత మీద ఉన్న అభిమానంతో టీడీపీ తరఫున ఎన్నికల  ప్రచారంలో పాల్గొన్నారు.

    2009 ఎన్నికల్లో  టీడీపీ ఓడిపోయినా, ఎన్టీఆర్  చేసినా ప్రచారానికే ఆ మాత్రం సీట్లు వచ్చాయని విశ్లేషకుల అభిప్రాయం. జూ. ఎన్టీఆర్ వారసత్వ రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడని అప్పుడు తనకు, తన కొడుకు లోకేష్ కు  రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన బాబు దూరం పెట్టాడని ఎన్టీఆర్ అభిమానులు, వైసీపీ నాయకుల ప్రధాన ఆరోపణ. అప్పటి నుంచి జూ. ఎన్టీఆర్ రాజకీయాలకు, టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు జర్నలిస్టులు, అభిమానులు రాజకీయాల్లోకి వస్తారా.. టీడీపీకి రాజీనామా చేశారా.. అని అడిగితే.. చిరునవ్వుతో ఇది సమయం కాదు..సందర్బం అంతకంటే కాదని దాటవేస్తూ వచ్చాడు.

    ఇటీవల హైదరాబాద్  వచ్చిన కేంద్రమంత్రి అమిషా ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఎన్టీఆర్ బీజేపీలో  చేరుతున్నాడని పుకార్లు వచ్చాయి. అది నిజం కాదని తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా హిట్ కావడంతో అభినందించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసి అభినందించారని చెప్పారు. అంతేగాని తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పారు.

    జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..

    జూ.ఎన్టీఆర్ అభిమానులు, తరచూ మీరు రాజకీయాల్లోకి వస్తారా.. వస్తే ఎప్పుడు వస్తారు.. అని అడగడంతో కోపగించుకోకుండా చిరునవ్వుతో దానికంటూ  ఒక సమయం సందర్భం వస్తుందని అప్పుడు తప్పకుండా చెబుతా అని దాటవేస్తూ వచ్చిన జూ. ఎన్టీఆర్ తాజాగా తెలంగాణలో ఖమ్మం జిల్లో ఈ నెల 28న నిర్వహించే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ 52 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభించేందుకు జూ  ఎన్టీఆర్ ను  ఆహ్వానించడం ఇదంతా చూస్తే ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చేస్తున్నరా.. లేక ఏదో రాజకీయ కోణంలో చేశారా. అని అభిమానులు, సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. జూ. ఎన్టీఆర్ తాత మీద ఉన్న అభిమానంతో వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించి వస్తారా.. ఆయన మాట్లాడుతారా.. మాట్లాడితే ఏం మాట్లాడుతారు అని చర్చ జరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...