
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోగల JSW & Jaiswaraajya మరియు UBlood కార్యాలయంలో శివ పార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీకమాసం కావడంతో ఆ పవిత్ర మాసం శివుడికి ప్రీతికరమైన మాసం కావడంతో తమ శక్తి కొలది శివ పార్వతులను పూజిస్తుంటారు భక్తులు.
పరమ శివునికి పరమ భక్తుడైన UBlood app ఫౌండర్ , JSW & Jaiswaraajya సంస్థల అధిపతి జై యలమంచిలి భక్తి ప్రపత్తులతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 17 రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జై యలమంచిలితో పాటుగా UBlood డైరెక్టర్ పాతురి నాగభూషణం అలాగే JSW & Jaiswaraajya సిబ్బంది పాల్గొన్నారు.
Sivaparvatula Kalyanam at Ublood Corporate Office Hyderabad
1 of 27