వృషభ రాశి వారికి పనుల్లో సహకారాలు ఉంటాయి. సంతోషంగా ఉంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారికి మంచి కాలం. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో పురోగతి ఉంటుంది. విష్ణు దర్శనం వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి వారికి మీ రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే ఇతరుల సలహాలు తీసుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.
సింహ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి వాతావరణం వస్తుంది. మనో ధైర్యం పోకుండా చూసుకోవాలి. దుర్గారాధన చేయడం మంచిది.
కన్య రాశి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు అడుగులు వేస్తారు.
తుల రాశి వారికి మానసికంగా ధైర్యంగా ఉంటారు. అధికారుల సహకారాలుంటాయి. ఆంజనేయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి వారికి చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శివారాధన చేయడం మంచిది.
ధనస్సు రాశి వారికి స్వీయ నిర్ణయాలు వద్దు. పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని సందర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు రావు. ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.
కుంభ రాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది. చిన్న సమస్యలను పెద్దగా భావిస్తుంటారు. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల అనుకూల అంశాలు ఉంటాయి.
మీన రాశి వారికి బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ReplyForward
|