
July 3rd Horoscope :
మేష రాశి వారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి తిండి నిద్ర ఉండేలా చూసుకోవాలి. దుర్గాదేవి ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కాలం అనుకూలంగా లేదు. నిర్లక్ష్యం వద్దు. మీ ప్రతిష్టను దిగజార్చుకోవద్దు. చంద్ర ధ్యానం చేస్తే మంచిది.
మిథున రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటే విజయం మీదే. ప్రయత్నిస్తే కానిదేమీ లేదు. ఇష్టదేవత దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మంచి మార్పులు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈశ్వర దర్శనం చాలా మంచి లాభాలు కలిగిస్తుంది.
సింహ రాశి వారికి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. అనవసరంగా మాట్లాడొద్దు. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. దుర్గా శ్లోకం చదవడం మంచిది.
కన్య రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం మంచి ప్రయోజనాలు అందిస్తుంది.
తుల రాశి వారికి తమ వారితో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. పెద్దల మాట వినండి. సూర్య జపం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి వారికి మామూలుగా ఉంటుంది. పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
ధనస్సు రాశి వారికి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు చురుగ్గా సాగుతాయి. కులదేవతా దర్శనం వల్ల మంచి జరుగుతుంది.
మకర రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శత నామావళి చదవడం శ్రేయస్కరం.
కుంభ రాశి వారు మానసికంగా బలంగా ఉంటారు. చేయని తప్పుకు మాటలు పడాల్సి వస్తుంది. పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు కలగజేస్తుంది.
మీన రాశి వారికి మంచి కాలం. అధికారులతో సంప్రదించి పనులు పూర్తి చేసుకుంటారు. ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విష్ణును కొలవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.