July 8 Horoscope :
మేష రాశి వారికి ఉద్యోగంలో మంచి మార్పులుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అన్నింట్లో శుభాలు కలుగుతాయి. ఈశ్వర ఆరాధన చాలా మంచిది.
వృషభ రాశి వారికి భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాటలు పొదుపుగా వాడాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలున్నా విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరిని కూడా అతిగా నమ్మకండి. దుర్గాదేవిని ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి వారు కష్టపడి పనిచేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూరప్రయాణాలు కలిసి రావు. సూర్యనారాయణ మూర్తి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి విజయావకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. గణపతిని ఆరాధిస్తే మంచిది.
కన్య రాశి వారికి సమయాన్ని వినియోగించుకుంటారు. ఒక వార్త మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి పనుల్లో విజయాలు దక్కుతాయి. ఒత్తిడిని దరిచేరనీయొద్దు. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మొహమాటానికి పోకూడదు. నిక్కచ్చిగా ఉండాలి. చంద్ర ధ్యానం చేయడం వల్ల ఇంకా శుభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. మీ నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. ఎవరిని నమ్మకండి. శివుడి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి కార్యాల్లో విజయాలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభకరమైన ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. లక్ష్మీదేవిని కొలవడం మంచిది.
మీన రాశి వారికి పనులు పూర్తి చేస్తారు. మాట పట్టింపులు వద్దు. దూర ప్రయాణాలు వద్దు. శివుడిని కొలిస్తే మంచి ఫలితాలు వస్తాయి.