
June 23rd Horoscope Results : మేష రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంప్రదాయాలను పాటిస్తారు. వాగ్వాదానికి దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి వారికి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పాటించే ధర్మమే మీకు రక్ష. సూర్యాష్టకం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి వారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అలసట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలహాలను పట్టించుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
సింహ రాశి వారికి ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇంటి నిర్మాణంపై ఫోకస్ పడుతుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
కన్య రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీలక్ష్మీని దర్శిస్తే మంచి లాభాలుంటాయి.
తుల రాశి వారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. మిత్రుల తోడ్పాటు ఉంటుంది. శని ధ్యానం చేస్తే శుభదాయకం.
వృశ్చిక రాశి వారికి అందరి సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవరోధాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. శని శ్లోకం చదివితే మంచిది.
ధనస్సు రాశి వారు మానసికంగా బలంగా ఉంటారు. అవసరానికి సాయం దక్కుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. వైరాగ్యాన్ని దూరం చేసుకోవచ్చు. శ్రీరామ నామాన్ని పఠించడం మంచి ఫలితాలు తెస్తుంది.
కుంభ రాశి వారు ఆనందంగా గడుపుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఉత్తమంగా నిలుస్తుంది.
మీన రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మనకు సంబంధించని పనుల్లో తల దూర్చొద్దు. గురుధ్యానం వల్ల మేలు కలుగుతుంది.