
June 25th Horoscope : మేష రాశి వారికి కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వార్తలు బాధిస్తాయి. దుర్గాదేవి, వెంకటేశ్వరుడిని దర్శించడం మంచిది.
వృషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు రావు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి వారికి అదృష్టం బాగుంటుంది. సమయానికి సాయం చేస్తారు. నూతన వస్తువులు ఖరీదు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
కర్కాటక రాశి వారికి సమస్యలు లేకుండా పనులు ముందుకు సాగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వెంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.
సింహ రాశి వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. సమయానికి తిండి నిద్ర ఉండేలా చూసుకోవాలి. విష్ణు నామస్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి పనులు చేయాలి. చర్చలు ఫలప్రదమవుతాయి. శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదివితే మంచిది.
తుల రాశి వారు ముందుచూపుతో ఉండలి. శారీరక శ్రమ పెరిగినా గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శివారాధన శుభప్రదం.
వృశ్చిక రాశి వారికి బుద్ధిబలం పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. శని ధ్యానం చేస్తే మంచిది.
ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు.సాహసాలకు వెళ్లకండి. అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి. విష్ణు నామాన్ని స్మరిస్తే మంచిది.
కుంభ రాశి వారికి చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆకట్టుకుంటుంది. దైవారాధన మంచిది. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మీన రాశి వారికి చేట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఒక వార్త ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే చాలా మంచి ఫలితాలు రావడం ఖాయం.