June 27th Horoscope : మేష రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. మానసికంగా బలంగా ఉంటారు. శుభ ఫలితాలు ఉంటాయి. శివాభిషేకం వల్ల మంచి జరుగుతుంది.
వృషభ రాశి వారికి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విరోధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి శ్రమ పెరిగినా విజయాలు దక్కుతాయి. సహనం కోల్పోకండి. నిదానంగా పనులు చేసుకోండి. చంద్ర ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారికి మనోధైర్యం కలుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రశేఖర అష్టకం చదివితే మంచిది.
కన్య రాశి వారికి చేపట్టే పనుల్లో అనుకూలతలు ఉంటాయి. మీ ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే శుభాలు కలుగుతాయి.
తుల రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహం కలుగుతుంది. మనోధైర్యంతో ముందుకు వెళతారు. అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం చేయడం ఉత్తమం.
వృశ్చిక రాశి వారికి బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. అనవసర ప్రయాణాలు మానుకోండి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది.
ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మంచి నిర్ణయాలతో పనులు పూర్తి చేస్తారు. దైవాన్ని ఆరాధించడం వల్ల లాభాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. బుద్ధిబలం పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈశ్వర ఆరాధన మంచిది.
కుంభ రాశి వారికి ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రుల సహకారం తీసుకుంటే మంచిది. పనుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. శివారాధన చేయడం వల్ల అన్ని శుభాలు వస్తాయి.
మీన రాశి వారికి అధికారులతో పనులు చేయించుకుంటారు. కుటుంబంలో సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. దైవారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.