
June 28th Horoscope : మేష రాశి వారికి పనుల్లో విజయం కలుగుతుంది. ప్రయాణంలో లాభాలు దక్కుతాయి. భరణి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంది. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి ఆర్థికంగా ఆశాజనకంగానే ఉంది. ఇష్ట దేవతారాధన మంచిది.
మిథున రాశి వారికి చేపట్టే పనుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చే పరిస్థితులు వస్తాయి. దుర్గాశ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి వారికి పనులు సాఫీగా సాగుతాయి. మానసికంగా ధైర్యం కలిగి ఉంటారు. ఇష్టదేవతను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి విజయాలు దక్కుతాయి. పట్టుదలతో ముందడుగు వేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. లక్ష్మీధ్యానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. నవగ్రహ స్తోత్రం చదవితే మంచిది.
ధనస్సు రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. పెద్దల మాట గౌరవిస్తే మంచిది. ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని శుభాలే కలుగుతాయి.
మకర రాశి వారు ప్రశాంతంగా గడుపుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే అన్ని శుభాలే కలుగుతాయి.
కుంభ రాశి వారు పనులు వాయిదా వేయకూడదు. భవిష్యత్ పై ఆశలతో ముందుకు వెళ్లండి. దుర్గారాధన మీకు మంచి ఫలితాలు అందేలా చేస్తుంది.
మీన రాశి వారు బద్దకాన్ని వదిలేయండి. అకాల భోజనం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. దుర్గారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.