Junior NTR fan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు దారుణంగా మారాయి. అధికార పార్టీ నేతలు తమ ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ప్రేమిస్తున్నాడనే కారణంలో పదో తరగతి చదువుతున్న బాలుడిని సజీవ దహనం చేసిన ఘటన మరవక ముందే ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై భిన్న కథనాలు వస్తున్నాయి. కొందరు ఆత్మహత్య అంటుంటే మరికొందరు మాత్రం అది కచ్చితంగా హత్యేనని వాదిస్తున్నారు. దీంతో పోలీసులు దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమాని అయిన శ్యామ్ నిరుద్యోగి. ఇతడి స్వస్థలం కొప్పిగుంట. శ్యామ్ చనిపోయిన ప్రాంతం చింతలూరు. ఇంట్లో కుర్చీ మీద నిలబడి ఉరివేసుకున్నట్లుగా ఉంది. ఇది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు. శ్యామ్ మోకాలి వరకు వంగి ఉన్నాడు. ఉరి వేసుకుంటే అలా ఎలా ఉంటాడనే ప్రశ్నలు వస్తున్నాయి. చేతికి బలమైన గాయం ఉంది. అతడి జేబులో గంజాయి ప్యాకెట్ ఉంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్యామ్ కాళ్లు నేలకు తాకుతున్నాయి. శరీరం, ముక్కు మీద కూడా గాయాలున్నాయి. అతడి దగ్గర గంజాయి ప్యాకెట్ ఉండటంతో మత్తులో వేసుకున్నా కాళ్లు నేలకు ఎందుకు తాకుతాయి. గాయాలు చూస్తుంటే అది ఆత్మహత్య కాదని అతడిని హత్య చేసి అలా ఉంచారనే వాదనలు వస్తున్నాయి. ముక్కులో నుంచి రక్తం కారుతుందని అంటున్నారు.
శ్యామ్ ను ఎవరైనా కొట్టి చంపి ఉరివేసుకున్నట్ల చిత్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఆత్మహత్యకు చాన్సే లేదంటున్నారు. రాక్షసంగా చంపి ఉరివేసి ఆత్మహత్యగా చెబుతున్నారు. విచారణ లోతుగా జరిపితే నిందితులు ఎవరనేది బయట పడుతుంది. ఈ నేపథ్యలో శ్యామ్ విరోధులపై కన్నేసి వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కోణంలోనే జరిగి ఉంటుందని అంటున్నారు.