JR NTR : ఏపీలో శ్యామ్ అనే యువకుడి ఆత్మహత్య పెద్ద సంచలనం అవుతున్నది. వైసీపీ నేతల కారణంగానే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపణలకు దిగాయి. ఏకంగా శ్యామ్ ను వారే చంపేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాయి. అయితే శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో అతడి ఆత్మహత్య ఈ సమయంలో మరింత సంచలనమైంది.
శ్యామ్ తన ఆత్మహత్యకు ముందే కారణాలను చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. ఇదంతా ఎవరూ పట్టించుకోలేదు. అయితే శ్యామ్ మరణం వెనుక కారణాలు కొంత అనుమానాస్పదంగానే కనిపించాయి. దీంతో టీడీపీ రంగ ప్రవేశం చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్యామ్ మరణం పై రాజకీయాలకు అంటగడుతూ వైసీసీ కార్యకర్తలు హత్య చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని మిత్రులు కూడా శ్యామ్ మరణం వెనుక ఇతర కారణాలు ఉన్నాయని, ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ విడుదల చేసిన వీడియోలో తన మరణానికి ప్రేమ వ్యవహారం కారణమని, వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని చెప్పాడు.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్యామ్ మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ కార్యకర్తలు హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు టీడీపీ యువనేత లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. శ్యాం కుటుంబానికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఇక అగ్ర నేతలు శ్యామ్ మరణం పై వైసీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా అదే స్పీడ్ తో వైసిపి పై దుమ్మెత్తి పోస్తూ ప్రచారం మొదలుపెట్టారు.
శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇందులోకి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా లాగాలని టీడీపీ ప్రయత్నించింది ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. శ్యామ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూనే ఎందుకు చనిపోయాడో తెలియక పోవడం కలిచి వేస్తున్నదని పేర్కొన్నారు అధికారులు ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.
తెలుగుదేశానికి కాస్త దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ అండ్ అభిమానులను తన వైపు తిప్పుకునేలా ఆయన ప్రయత్నాలు చేశారు. మరికొందరు మాత్రం టీడీపీ తీరుపై మండిపడ్డారు. శివ రాజకీయాలు చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తున్నదని చివరకు చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం నీచమని పేర్కొన్నారు. తనకు తానే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నా వైసీపీ నేతలు హత్య చేశారంటూ చంద్రబాబు ఫీడ్ చేయడం సంచలనమైంది. ఏదేమైనా రెండు పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి రాజకీయాలకు దిగడం ఏపీ ప్రజలకు ఇబ్బందిగా మారింది.