
Jyotirai : జ్యోతిరాయ్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. సీరియల్స్ అంటే తెలియని వారు కూడా ఈవిడంటే తెగ ఇష్టపడిపోతుంటారు. ఎవరైనా ఈమె గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నా వాళ్లకు ’గుప్పెడంత మనసు‘ జగతి మేడం అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. కర్ణాటకకు చెందిన ఈమె తెలుగు సీరియల్స్ తో పాటు కన్నడ, తమిళ్, మలయాళం తదితర సినిమాల్లో నటించింది. తెలుగు ఆన్ స్క్రీన్ లో రిషీకి తల్లిగా ఈమె నటనకు ఫిదా అవని బుల్లితెర ఆడియన్స్ లేరు అంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా ఆడియన్స్ లో జ్యోతిరాయ్ పాపులారిటీ అంతా ఇంతా కాదు మరి. సీరియల్స్ చూడని కుర్రకారు కూడా ఈవిడంటే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ లో సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసే ఫొటోలే కారణం. సీరియల్స్ లో క్యూట్ గా నటించే ఈ బ్యూటీ పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ఈ కన్నడ సోయగం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో కుర్రకారు మనసులో మత్తెక్కిస్తుంది.
సాధారణంగా ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు, ఆమె నటించే రోల్స్ కు అసలు సంబంధమే ఉండదు. తాజాగా ఈ సుందరి సోషల్ మీడియాలో చేసిన ఫొటోలతో యూత్ కు చిన్న సన్న కిక్కు ఇవ్వట్లేదు. ఇంత అందాలు ఉన్న ఈ కన్నడ బ్యూటీ సీరియల్స్ లో నటించడమేంటనే కామెంట్స్ కుర్రకారు నుంచి వస్తుంటాయి. హీరోయిన్ కూడా మీ ముందు దిగుదుడుపే అంటూ పోస్టులు చేస్తుంటారు. కొందరైతే ఏకంగా ఏమా అందచందాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అందానికే అసూయ పుట్టేలా కామెంట్స్ చేస్తుంటారు.
ఈమె నటనకు ఎన్నో అవార్డులు పొందింది. 2009లో మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ కేటగిరీలో ఏషియన్ ఫిల్స్ అవార్డు దక్కించుకుంది. అలాగే మలయాళంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ర్టెస్ గా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందింది. ఈ రెండు కూడా ’ఎవిడం స్వర్గమాను‘ చిత్రానికి దక్కాయి. 2011లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ తమిళం మణ్ కథ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది.






