26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Kadambari Jethwani : కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసుల పై వేటు.. నెక్ట్స్ ఆ ఐపీఎస్ లే ?

    Date:

    Kadambari Jethwani
    Kadambari Jethwani

    Kadambari Jethwani :  సాధారణంగా ఏదైనా ఘటన జరిగితే, పోలీసులు తొలుత కేసు పెట్టి, తర్వాత దర్యాప్తు చేయడం కామన్. మాజీ సీఎం జగన్‌ భక్తులైన ఐపీఎస్‌లు మాత్రం నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబైకి విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకుని అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి ఫిర్యాదు చేశారు. అదే రోజు 11.30కి విమానంలో డీసీపీ విశాల్‌ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబైకి వెళ్లింది. ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్‌ చేశారు. అంటే, విద్యాసాగర్‌ ఫిర్యాదుకు ముందురోజు అన్న మాట.! దీన్నిబట్టే ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. సంచలనం సృష్టించిన కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు ద్వారా ప్రభుత్వానికి చేరింది.

    ముంబై పారిశ్రామికవేత్త పేరు ఎక్కడా బయటకు రాకుండా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలని అప్పటి ఓ కీలక నేత ఆదేశాలతో నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పి.సీతారామాంజనేయులే స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై జనవరి 31న విజయవాడ సీపీ కాంతిరాణా తాతాతో చర్చించినట్లు సమాచారం. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఏదో కేసు పెట్టి, వెంటనే నటి కాదంబరిని అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పిలిపించి కాదంబరి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన ఆస్తిపై కాదంబరి తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి, ఇతరులకు విక్రయించినట్లు ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు పెట్టారు. ఆమె అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతిరాణా తనకు అనుకూలమైన అధికారులను వినియోగించారు. ముంబైకి వెళ్లడం, అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్‌కు పంపడం వరకూ కాంతిరాణా, విశాల్‌ గున్ని ఆధ్వర్యంలోనే జరిగింది. జత్వానీ పేరిట ముంబైలో స్టాంపు పేపర్‌ కొనుగోలు చేసి, 2018లో రాసినట్లు సృష్టించారు. ఇందులో వైసీపీకి చెందిన ఓ న్యాయవాది కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

    కాదంబరిపై కేసు నమోదు, అరెస్టు, రిమాండ్‌ ప్రక్రియల్లో అన్ని దశల్లోనూ తాము చట్టబద్ధంగానే వ్యవహరించామన్న భ్రమ కల్పించేందుకు పోలీసులు పలు ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తోంది. అవన్నీ కాదంబరి ఫిర్యాదు తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. సెర్చ్‌ వారెంట్, ట్రాన్సిట్‌ వారెంట్, ముంబైలో స్థానిక పోలీసులతోనే మధ్యవర్తుల పంచనామా, తదితర అంశాల్లో పక్కాగానే చేశారు. కాకపోతే, ఒప్పంద పత్రంలోని అంశాలు, సాక్షులుగా ఎంచుకున్న వారు వైసీపీ నేత అనుకూలురు కావడం, వారు నేడు వాస్తవాలు వెల్లడించడంతో కుట్రకోణం బలపడింది.  దీంతో తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్‌లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని కీలక వ్యక్తులు అని కాదంబరి ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్‌ దృష్టికి తెచ్చారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని, అతనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్‌పై విజయవాడలో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kadambari Jethwani : కాదంబరీ జెత్వానీ అక్రమ అరెస్టు కేసులో.. ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

    Kadambari Jethwani ఏపీలో సంచలనం సృష్టించిన సినీ నటి కాదంబరీ జెత్వానీ...

    Jethwani : చంద్రబాబు నాకు న్యాయం చేయాలి: జెత్వానీ

    Jethwani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా...