
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87 ) ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 87 సంవత్సరాల సత్యనారాయణ 60 ఏళ్లకు పైగా నట జీవితంలో దాదాపు 800 చిత్రాల్లో నటించారు. హీరోగా , విలన్ గా , హాస్య నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించారు. తెలుగు ప్రేక్షకులు హృదయలాలో చెరగని ముద్ర వేశారు కైకాల.
పౌరాణిక , జానపద , చారిత్రాత్మక , సాంఘిక ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించారు. కైకాల మంచి భోజన ప్రియుడు కూడా. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సోదరుడు నాగేశ్వరరావు తో కలిసి పలు చిత్రాలను నిర్మించారు కైకాల. అలాగే రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరుపున లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్ లో కూడా అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఈరోజు తెల్లవారు జామున మరణించారు. దాంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది.