
Kalaavati glamour : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి వంటి గొప్ప సినిమాలో నటించి ప్రేక్షకుల మనస్సులో స్థానం పొందింది.. ఇక ఈ సినిమాతో ఏకంగా కీర్తి జాతీయ అవార్డును అందుకుని సంచలనం క్రియేట్ చేసింది..
కీర్తి సురేష్ ఈ రేంజ్ లో నటనను కనబరుస్తుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేదు.. ఎందుకంటే నేను శైలజ సినిమాలో ఈమె అంతగా హావభావాలను పలికించలేదు.. అందుకే మహానటి సావిత్రి వంటి గొప్ప మనిషి పాత్రను ఎలా పోషిస్తుందో అని అంతా అనుకున్నారు.. కానీ ఈమె తన నటనతో అందరిని ఫిదా చేసింది..
ఇక ఈమె అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.. ఈ సినిమా హిట్ వల్ల ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. అమ్మడు చేతిలో ప్రజెంట్ మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్టు టాక్..
ఇక ఇదిలా ఉండగా ఈమె ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచింది అని చెప్పాలి.. సర్కారు వారి పాట నుండి ఈమె కొద్దిగా గ్లామరస్ గా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా వరుసగా గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును తన వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కలర్ ఫుల్ డ్రెస్ లో అమ్మడు మరింత అందంగా, గ్లామరస్ గా కనిపిస్తూ ఫిదా చేస్తుంది. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram