
Kakarakaya Chips : డయాబెటిస్ వారికి కాకరకాయ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. కాకరకాయలో చేదు గుణం ఉండటంతో ఇది షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కాకరకాయ తినడం వల్ల మధుమేహం నియంత్రనలో ఉంటుంది. ఇతర జబ్బులు కూడా దరిచేరవు. మరి దీన్ని ఎలా తినాలి? కూరగా చేసుకోవచ్చు. ఫ్రైగా కూడా తినొచ్చు.
కాకరకాయను చక్రాల్లా కోసుకోవాలి. అందులో ఉన్న విత్తులను తీసివేయాలి. ఓ ఐదు నిమిషాలు ఉప్పు వేసిన నీళ్లలో నానబెట్టాలి. తరువాత ఫ్రై చేసుకుంటే కరకరలాడతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకరకాయ ముక్కలను ఓ గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇంకో గిన్నె తీసుకుని అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
తరువాత బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. తరువాత ఓ గిన్నెలో నూనె వేసి అందులో ఈ ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. తరువాత తీసి ఆయిల్ పోయేలా చేసి వాటిని భద్రపరచుకోవాలి. ఇక ఈ ముక్కలను తింటే మనకు ఎన్నో రోగాలకు ఉపశమనం లభిస్తుంది.
కాకరకాయ అంటేనే చేదు. ఇది మధుమేహానికి భలే ఉపయోగపడుతుంది. చేదు ఉన్న వాటిని తీసుకుంటే షుగర్ కు చాలా మంచిది. అందుకే అందరు కాకరకాయను విరివిగా వాడుకుని డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని తాపత్రయ పడతారు. ఇది షుగర్ కు అద్భుతమైన మందుగా భావిస్తారు. అందుకే రోజు తీసుకుని నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తారు.