21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Project K Villan : ‘ప్రాజెక్ట్ కే’ లో విలన్ గా కమల్ హాసన్.. ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషనా..?

    Date:

    Project K Villan
    Project K Villan

    Project K Villan : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి కంటెంట్ తో సినిమా రాలేదని, ఇది చూసిన ప్రేక్షకులు తప్పక ఫీల్ అవుతారని మేకర్స్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకచ్చారు. అయితే నాగ్ అశ్విన్ పై మేకర్స్ తో పాటు ఆడియన్స్ కూడా బాగా విశ్వాసం ఉంది.

    ఈ ఏడాది లోనే ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ పూర్తి చేసుకోబోతుదని వార్తలు వినిపించాయి. 2024 సంక్రాంతి వరకు ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పడుకోన్ నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది. ‘ప్రాజెక్ట్ కే’లో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నారట. ఇందుకు ఆయన రూ. 150 కోట్ల వరకూ ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్నీ ప్రకటించింది. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో తెలియాల్సి ఉంది. అయితే కమల్ హాసన్ ‘విక్రమ్’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ఆయన హీరోగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

    కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత ఆయన తమిళ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘ఇండియాన్ 2’ కోసం పని చేస్తున్నాడు. ఆయన కెరీర్ ఇంత పీక్ లో వెళ్తున్న సమయంలో నెగెటివ్ రోల్స్ లో చేస్తాడా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నా.. విశ్వనటుడికి ఈ రోల్ ఒక లెక్కే కాదు.. ఇది ఆయనకు ఎటువంటి మచ్చ తీసుకురాదని కొందరు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...