28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ..

    Date:

    Kamal Haasan
    Kamal Haasan

    Kamal Haasan : దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు. తమిళ సూపర్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి డీఎంకే పార్టీ కమల్ ను పెద్దల సభకు నామినేట్ చేస్తుందని సమాచారం. జూలైలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

    ఈ ప్రచారం తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు. తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ ఇంటికి వెళ్లారు. కమల్ ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. మీకు రాజ్యసభ సీటు కన్ ఫర్మ్ చేసినట్లు చెప్పారట.

    కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయం పార్టీ గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. పొత్తులో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2025 ఏడాదికి ఒక రాజ్యసభ సీటు ఇస్తామని అప్పట్లో వాగ్దానం ఇచ్చారట. ఈ డీల్ లో భాగంగా, లోక్ సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు, మిత్ర ధర్మం పాటిస్తూ.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారట.

    కాగా, దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు. జూన్ లో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రామిస్ ను కమల్ హాసన్ కు చేరవేశారు మంత్రి శేఖర్ బాబు. మిమ్మల్ని పెద్దల సభకు పంపిస్తామని కమల్ హాసన్ తో ఆయన చెప్పినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Roja : జగన్, వైసీపీని వదిలించుకున్న రోజా.. ఇకపై అరవ రాజకీయం

    Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తన సోషల్...

    Vijay : తన పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ్ స్టార్ హీరో విజయ్

    Vijay :  తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...