
Kangana Ranaut : కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ హారర్ చిత్రం నుంచి నటి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ తో చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగనా అందమైన ఆకుపచ్చ, బంగారు రంగు చీరలో మెరిసింది. తన చీరకు సరిగ్గా సరిపోయే భారీ ఆభరణాలను ధరించి మెరిసిపోయింది. రాజభవనం లోపల నిల్చొని, కెమెరాకు దూరంగా చూస్తూ ఇచ్చిన ఫోజ్ అదిరింది.
‘అప్రయత్నంగా మన దృష్టిని ఆకర్షించే అందం, భంగిమ! చంద్రముఖిగా కంగనా రౌనత్ అత్యద్భుతమైన, కమాండింగ్, అందమైన ఫస్ట్ లుక్ ను ప్రెజెంట్ చేసింది. ఈ వినాయక చవితి సందర్భంగా తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని చిత్రబృందం ట్వీట్ చేసింది. చంద్రముఖి లాంటి భారీ హరర్ ఇందులో కూడా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. పార్ట్ 1 కన్నా మరింత ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, స్టోరీ ఉండబోతోందని యూనిట్ చెప్పింది.
రజినీకాంత్, జ్యోతిక జంటగా నటించిన అత్యంత విజయవంతమైన తమిళ హారర్ కామెడీ చంద్రముఖికి సీక్వెల్ గా పీ వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 రూపొందుతోంది. చంద్రముఖికి కూడా వాసుకే డైరెక్టర్ గా ఉన్నాడు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ చంద్రముఖి తీస్తున్నాడు. చంద్రముఖిలో రజనకాంత్ కనిపించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.






