22.5 C
India
Friday, January 23, 2026
More

    Actor Darshan : కన్నడ నటుడు దర్శన్ మేనేజర్ ఆత్మహత్య

    Date:

    Actor Darshan
    Actor Darshan

    Actor Darshan : ఇప్పటికే అభిమానిని హత్య చేసిన కేసులో ఇరుక్కున్న దర్శన్.. ఇప్పుడు ఆయన మేనేజర్ ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు చెందిన బెంగళూరు ఫామ్ హౌస్ ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్ తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.

    విపరీతమైన ఒంటరితనం కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని, తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

    ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related