
Mudragada vs Pawan Kalyan :
ఏపీలో ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం ఉన్నా ఒక్కసారిగా పొలిటికల్ వార్ హీటెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, కౌంటర్లతో ఏపీ రాజకీయాలు హోరెత్తున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవాల్సింది పోయి జనసేన అధినేత పవన్ కల్యాన్, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మధ్య వార్ కొనసాగుతున్నది.
పవన్ కు ముద్రగడ మరోలేఖ
‘కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ ను పవన్ స్వీకరించి పవన్ అక్కడి నుంచి పోటీ చేయాలని, లేదంటే పిఠాపురం నుంచి బరిలోకి దిగాలని ముద్రగడ మరోలేఖ రాశారు. అందుకు సిద్ధపడ్డాకే తనను సవాల్ చేయాలని ముద్రగడ సూచిస్తున్నారు. అయితే వైసీపీ రాజకీయ ఎత్తుగడనా, లేక ముద్రగడ సొంత అభిప్రాయమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే పిఠాపురం శాసన సభ నుంచి బరిలోకి దిగడానికి ముద్రగడ ప్లాన్ వేసుకున్నాడని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇద్దరు కాపు నేతల మధ్య ఇంత పోటీ ఎందుకన్నది అంతుచిక్కడం లేదు.
అయితే ముద్రగడ వైసీపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారని, ఇలా తమ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తాను బరిలోకి దిగాల్సి వస్తుందని ముద్రగడ ఎత్తుగడ అని కొందరి టాక్. ఈ సాకుతో ముద్రగడ వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తున్నది.
సెంటిమెంట్ పవన్ కు కలిసొచ్చేనా?
ఇన్నాళ్లు తమ సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తున్నట్లు ముద్రగడ కలరింగ్ ఇచ్చాడని, ఇప్పడు కొత్త నినాదం ఎత్తుకున్నాడని కాపు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఊడిగం చేశారని, రిజర్వేషన్ అమలు చేయకపోయినా, కార్పొరేషన్‌కు నిధులు కేటాయించనా జగన్ ను వెనకేసుకు రావడం ఏమిటని కాపు సామాజికవర్గం నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సవాల్ ను పవన్ కల్యాణ్ స్వీకరిస్తే రాజకీయంగా బలపడవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ సామాజిక వర్గానికి జగన్ ఏమి చేయలేదనే అపవాదు ఉన్నది. ఆ సెంటిమెంట్ మెంట్ ను రెచ్చగొడితే పవన్ కు కాపుల మద్దతు ఏకపక్షంగా ఉంటుందనే వాదనా వినిపిస్తున్నది. రాజకీయంగా పవన్ కు మంచి మైలేజ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి పవన్ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తాడేమో చూడాల్సిందే..
వైసీపీ స్కెచ్ ఇదేనా.?
ముద్రగడ వైసీపీలో చేరితే కాకినాడ ఎంపీ టికెట్ లేదా పిఠాపురంతో పాటు ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తు్న్నది. వైసీపీలోకి వెళ్లలేని పక్షంలో అతని కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. లబ్ధి పొందాలన్నది వైసీపీ ప్లాన్.! జగన్ పక్కన పెట్టిన ఎమ్మెల్యేల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో అయితే ముద్రగడ ఎంపీగా పోటీ చేయకుంటే అతడి కుమారుడికి వైసీపీ కండువా కప్పాలనే ప్లాన్ వైసీపీ వ్యూహం. పిఠాపురం నుంచి ముద్రగడ కుమారుడు బరిలో దించాలని వైసీపీ భావిస్తున్నది. దీంతో కాపుల ఓట్లు కలిసి వస్తాయని జగన్, ముద్రగడ ప్లాన్. అయితే ముద్రగడ మాటవరుసకే అన్నారో లేకుంటే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ పవన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం సెంటిమెంట్ పరంగా కలిసివచ్చే అంశమే.