Devara Story :
దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరలో సామాజిక అంశాన్ని జోడిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకునే విషయం చూపించి ఎందరికో స్ఫూర్తిని నింపాడు. తరువాత జనతా గ్యారేజ్ లో మొక్కల సంరక్షణపై గురిపెట్టారు. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో అంశాన్ని తీసుకుని హైలెట్ చేయడం ఆయన అలవాటే.
ఇప్పుడు దేవరలో 1985లో ప్రకాశం జిల్లాలోని కారంచేడులో దళితులపై దాడి చేసిన ఘటనను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఏ సందేశం ఇవ్వనున్నారో తెలియడం లేదు. దేవర పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవితో తీసిన ఆచార్య బెడిసి కొట్టడంతో ఈ సారి మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో దేవర సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సలార్ కంటే ముందే ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉన్నా అది వాయిదా పడింది.
దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. మొదటి సారి సోలో హీరోగా పాన్ ఇండియా మూవీ చేస్తున్న దేవర సినిమాపై కొరటాల శివ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.