
Karate Kalyani : కరాటే కల్యాణీ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఈమె ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వరుసగా కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తుంది.. ఎందుకంటే ఖమ్మం లోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. ఈ విషయం పైనే ఈమె వరుసగా నిరసనలు, నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది..
మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగ నున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు భారీ ఏర్పాట్లు చేసారు..
ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి అభ్యంతరం చెబుతుంది.. హిందువులకు దైవం అయిన కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఈమె తప్పుబడుతూ కామెంట్స్ చేస్తుంది.. ఈమె మరొకసారి వైరల్ కామెంట్స్ చేసింది..
తాజాగా మీడియా వేదికగా ఈమె ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసారు.. ఇందులో ఈమె మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ దైవం అంటున్నారు.. దైవం.. ఓకే.. ఎవరికీ దైవం.. ఏ వర్గానికి దైవం.. ఎవరి కోసం ఆయన్ని దైవాన్ని చేస్తున్నారు.. దైవానికి మానవుడికి తేడా ఉంది.. మానవుడు దేవుడు అయితే మనం దేవుడి గురించి మాట్లాడు కోవడం ఎందుకు? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పుకొచ్చింది.