Movie Titles : ఈ మధ్యకాలంలో మూవీ పేర్లు చూస్తుంటే అవి ఊరు పేర్లా లేకుంటే సినిమా టైటిల్స్ నా అనే సందిగ్ధం ప్రేక్షకుల మదిలో ఉంటుంది.. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతుండగా వాటి టైటిల్స్ గా తెలంగాణ పల్లెల పేర్లనే ఎంచుకుంటున్నారు.. ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని పల్లెల పేర్లను టైటిల్స్ గా పెడుతూ సూపర్ హిట్స్ కొడుతున్నారు మేకర్స్. మరి ఆ టైటిల్స్ ఏంటి ? హిట్ అయిన సినిమాలు ఎన్ని? అనేవి ఇప్పుడు చూద్దాం..
బలగం.. ప్రముఖ కమెడియన్ వేణు మొదటిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలంగాణ నేపథ్యంలో పక్కా పల్లెటూరు పాత్రలతో తెరకెక్కిన బలగం సినిమా బాగా హిట్ అయ్యింది. చిన్న సినిమా అయిన ఎమోషన్స్ అన్నిటిని చాలా బ్యాలెన్స్ గా చూపించడంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఉమ్మడి కరీంనగర్ పల్లెల నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా తెలంగాణ ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మాత్రమే కాదు ఓదెల రైల్వేస్టేషన్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలు తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి కరీంనగర్ జిల్లా పల్లెల పేర్లతోనే తెరకెక్కి మంచి విజయం సాధించాయి.
ఇక ఇప్పుడు తాజాగా రుద్రంగి పేరుతొ తెరకెక్కిన సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని పల్లెల పేర్లను సినిమా టైటిల్స్ గా పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్స్ కూడా కొడుతున్నారు. ముందు ముందు మరిన్ని సినిమాలు కూడా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.