- ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

Karnataka Counting Start : దేశమంతా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ 8గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలట్ లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలట్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు కాంగ్రెస్, బీజేపీ తలపడుతున్నాయి. జేడీఎస్ పెద్దగా ప్రభావం చూపలేదు. పోస్టల్ బ్యాలెట్ అంతగా కీలకం కాకున్నా, ప్రస్తుతమైతే రెండు పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. మరి కొన్ని గంటల్లో ట్రెండింగ్ తెలిసిపోనుంది. వార్ వన్ సైడ్ ఉంటుందని రెండు పార్టీల నాయకులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ దూసుకుపోతున్న కాంగ్రెస్
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మరో వైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతున్నది. 34 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, బీజేపీ, కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ లో హోరాహోరీ తలపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో ముందున్నది. మరికొన్ని నిమిషాల్లో ఈవీఎంల లెక్కింపు మొదలు కానుండగా, అసలు లెక్క మొదలు కానుంది. కాగా , ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్నది. కర్ణాటక మొత్తం 144 సెక్షన్ ను పోలీసులు కొనసాగిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత కుమార స్వామి మీడియాతో స్పందిస్తూ మరో మూడు గంటలో విషయం తేలిపోతుందని చెప్పారు. తనను ఎవరూ మద్దతు కోసం సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ముందంజ
కర్ణాటక నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈవీఎంల కౌంటింగ్ కూడా 8.30 కి ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ హోరాహోరీగా కొనసాగినా కొంత కాంగ్రెస్ వైపు ఎడ్జ్ కనిపిస్తున్నది. 224 సీట్లకు జరుగుతున్న కౌంటింగ్ లో 113 మ్యాజిక్ ఫిగర్ వచ్చిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మరి కొన్ని గంటల్లో విజేతలెవరో తేలనుంది. ఓట్ ఫ్రం హోం, పోస్టల్ బ్యాలట్ ఓట్లలో 100 కి పైగా సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 80, జేడీయూ 13 సీట్లలో ముందంజటో కొనసాగుతున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు మారుతున్నాయి.