
Karnataka victory 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ నాయకత్వంలో కొంత మేరకు ఉత్సాహం నింపుతుంది. కానీ ఇక్కడ పార్టీకి జవసత్వాలు వస్తాయని మాత్రం చెప్పడం కష్టం. కర్ణాటక విజయవం వైపు పయనిస్తుంటే నాయకులు, పార్టీ కేడర్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే రిజసల్ట్స్ వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఆ దిశగా ఇక్కడి పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతీ ఐదేళ్లకు కన్నడిగులు ప్రభుత్వాన్ని మారుస్తుంటారు. ఇది అక్కడ కామన్. గతంలో బీజేపీ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పటవుతుందని అందరూ అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.
తెలంగాణలో పాలకపక్షం బీఆర్ఎస్ రోజురోజుకు పట్టు సడిలిపోతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయవచ్చు. లేదా అంతకన్నా తక్కువ సీట్లే రావచ్చు. అయితే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. ప్రతీ ప్రజా వ్యతిరేక అంశాన్ని తలకెత్తుకుంటూ పాలకపక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా సొంత కుంపటిలో పోరును భరిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంకా గాంధీ ఇక్కడి సీనియర్ నాయకులకు పలు సూచనలు చేశారు. అంతా కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
కాంగ్రెస్ కు తెలంగాణలో కేడర్ ఉన్నా నాయకులు తరుచూ గొడవలు పడుతుండడంతో కేడర్ లో నిరాశ నిండుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తుండడం, వారితో కలిసి నడిచేందుకు రేవంత్ కూడా ప్రయత్నించడం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ కు మంచి నాయకత్వం ఉంది.. దీనికి తోడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా గుర్తింపు ఉంది. ఇన్ని ఉన్నా ఇక్కడ గెలిచేలా కనిపించడం లేదు.
బీజేపీ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. గతంలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఇక హుజురాబాద్, మునుగోడు బై పోల్ లో సైతం కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇక్కడ పార్టీకి ఊపిరి పోసేలా కనిపించడం లేదు.