Kartika masam : కార్తిక మాసం తొలి సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారు జామునే కృష్ణా, గోదావరి తీరాల్లో పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఉదయాన్నే భక్తుల రద్దీతో ప్రముఖ శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏపీ లోని ప్రముఖ
శూవక్షేత్రం శ్రీశైలంలో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ, అమరావతిలోని అమరేశ్వరాలయాల్లో దర్శనాలకు తరలివస్తున్నారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇవాల రెండు సార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వాడపల్లిలోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయతో పాటు పిల్లలమర్రి, మేళ్లచెరువు శివాలయాలకు భక్తలు పోటెత్తారు.